News March 23, 2024

ADB: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లే కీలకం

image

ప్రత్యేక ఓటరు సవరణ తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 16,43,604 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,02,267 మంది పురుషులు, 8,41,250 మంది మహిళలు, 87 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిర్పూర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్థుల జయాపజయాల్లో మహిళా ఓటర్లే కీలకం.

Similar News

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

News December 17, 2025

గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

image

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.

News December 17, 2025

ఆదిలాబాద్: పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌: ఎస్పీ

image

పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్‌) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్‌ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్‌ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.