News October 10, 2025

ADB: పిల్లల ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డు’

image

జీవితంలో రోజుకో గుడ్డు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. పిల్లల ఎత్తు, బలం, మెదడు అభివృద్ధికి గడ్డు చాలా అవసరం. పేదరికం, పోషకాహార లోపం ఉన్న కుటుంబాలకు గడ్డు ఆర్థికంగా అందుబాటులో ఉండే ఉత్తమ ఆహారం. అంగన్వాడీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో విద్యార్థులకు గుడ్లు ఆహారంలో చేరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 250+హాస్టళ్లలో 40,000 మందికి గుడ్లు అందిస్తున్నారు.
#నేడు వరల్డ్ ఎగ్ డే

Similar News

News October 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్‌: రేపటినుంచి బీజేపీ ప్రచారం

image

జూబ్లీహిల్స్‌లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచాయి. నెక్ట్స్ రంగంలోకి బీజేపీ దిగనుంది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదేశించారు.

News October 10, 2025

‘అరి’ రేటింగ్&రివ్యూ

image

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే సినిమానే ‘అరి’. మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తారనేది డైరెక్టర్ జయశంకర్ కథతో ఆవిష్కరించారు. సాయికుమార్, వినోద్ వర్మ, అనసూయ నటన మెప్పించింది. అనూప్ మ్యూజిక్, క్లైమాక్స్ బాగుంది. స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు వాస్తవ దూరంగా ఉండటం, కామెడీ పండకపోవడం మైనస్.
రేటింగ్- 2.5/5

News October 10, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: కంప్లైంట్ నంబర్లు ఇవే!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరైనా.. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిస్తే ఈ నంబర్లకు కాల్ చేసి చెప్పొచ్చు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంగతయారు నియమితులయ్యారు. 91776 08271, 91212 40116, 98490 44893 నంబర్లు ఏర్పాటు చేశారు.