News October 1, 2024

ADB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News October 1, 2024

నిర్మల్: సడలని సంకల్పం.. అప్పుడు సర్పంచ్ ఇప్పుడు టీచర్..!

image

చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. TUలో బీఈడీ పూర్తిచేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013)నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించి, సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆయనను పలువురు అభినందించారు.

News October 1, 2024

ఆదిలాబాద్: DSCతో భర్తీ కానున్న పోస్టులు

image

ఆదిలాబాద్ జిల్లాలో DSCతో పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 324 పోస్టుల్లో 74 స్కూల్ అసిస్టెంటు, 14 లాంగ్వేజ్ పండితులు, రెండు పీఈటీలు భర్తీ కానుండగా అత్యధికంగా 209 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ సారి కొత్తగా ప్రత్యేకావసర పిల్లల బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను నోటిఫై చేశారు. ఇందులో ఆరు స్కూల్అసిస్టెంటు, 19 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

News October 1, 2024

ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఆదిలాబాద్ రాంనగర్‌లో దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు ఎస్ఐ విష్ణు తెలిపారు. మరో మహిళ ఆ గృహానికి అమ్మాయిలను మభ్యపెట్టి తీసుకెళ్లి వేశ్య వృత్తిలోకి దింపుతోందన్నారు. సోమవారం ఇంట్లో దాడి చేయగా వ్యభిచార గృహం నిర్వాహకులు, అమ్మాయిలను సరఫరా చేసే మహిళ, ముగ్గురు విటులు, బాధితులను గుర్తించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.