News August 9, 2025

ADB: పోక్సో కేసులపై పునః పరిశీలించాలని కలెక్టర్‌కు వినతి

image

ఉపాధ్యాయులపై నమోదవుతున్న పోక్సో కేసులపై పునః పరిశీలించాలని PRTU TS ఉపాధ్యాయ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏ తప్పు చేయని ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడం ద్వారా మానసిక క్షోభకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో సమాజంలో ఉపాధ్యాయులపై చులకన భావం కలుగుతుందని జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ పేర్కొన్నారు.

Similar News

News August 31, 2025

జానపద దినోత్సవాల్లో ADB కళాకారులు

image

HYDలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ సంబరాల్లో ఆదివారం బాలకేంద్రం చిన్నారులు పాల్గొన్నారు. ఎల్లమ్మ బోనాల పాటపై నృత్య ప్రదర్శన చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు నిర్వాహకులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2025

నేడు చర్లపల్లి నుంచి ADBకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం అన్ రిజర్వుడు టీఓడీ ప్రత్యేక రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌కు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి 8:10 నిమిషాలకు రైలు బయలుదేరి సోమవారం ఉదయం 6:15 నిమిషాలకు అదిలాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.

News August 31, 2025

ADB: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

image

జిల్లాస్థాయి యోగాసనా పోటీల్లో పతంజలి యోగా కేంద్రం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్‌ విభాగంలో విష్ణుప్రియ, సంధ్య, సహస్ర, జూనియర్‌ విభాగంలో వైష్ణవి, W.వైష్ణవి మొదటిస్థానం సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి చేతన్‌, సంయుక్త కార్యదర్శి సంతోష్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వారు అభినందించారు.