News August 18, 2025

ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News August 18, 2025

రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

image

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.

News August 18, 2025

ఎడ్ల బండెక్కి.. రైతులను పరామర్శించిన పాయల్ శంకర్

image

ఎడ్ల బండెక్కి పంట పొలాల్లో కలియ తిరుగుతూ రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం చెందిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. భోరజ్ మండలలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కోరాట, పూసాయి, పిప్పర్‌వాడ తదితర గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరీ అగ్రికల్చర్ అధికారులతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటను పరిశీలించారు

News August 17, 2025

రేపు గణేష్ మండప నిర్వాహకులతో ఎస్పీ సమావేశం

image

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండప కమిటీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో ఈనెల 18న ఆదిలాబాద్ తనీషా గార్డెన్‌లో ఉదయం 10:30 గంటలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహిస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిర్వహకులకు మండపాల ఏర్పాటుపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కమిటీ సభ్యులు చేయవలసిన విధి విధానాలపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వన్ టౌన్, టూటౌన్, మావల, రూరల్ మండపాల సభ్యులు కావాలన్నారు.