News July 19, 2024

ADB: పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంను ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించి వంటలు నిర్వహించే వారికి సూచనలు చేశారు. ఆహారాన్ని నాణ్యతతో కూడిన వస్తువులతో వండాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు శిక్షణ కాలంలో క్రమం తప్పకుండ హాజరవ్వాలని అన్నారు.

Similar News

News August 20, 2025

భీంపూర్: ఉప్పొంగిన వాగు.. ఆగిపోయిన బస్సు

image

ADB నుంచి గోమూత్రి, కరంజి గ్రామాలకు వెళ్లే బస్సును అంతర్గామ్ వద్ద వాగు ఉప్పొంగడంతో రాత్రి మార్గమధ్యంలోనే నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై పీర్ సింగ్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకొని స్థానిక యువకులతో కలిసి తాడు సహాయంతో ప్రయాణికులను వాగు దాటించారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వాగులు, వంకలను దాటవద్దని ఎస్సై సూచించారు. తమకు సహకరించిన పోలీసులు, యువకులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.

News August 19, 2025

ADB: మంత్రి జూపల్లికి BRS నాయకుల వినతి

image

ADB పర్యటనకు వచ్చిన ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని బీఆర్ఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి లేఖలో డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రూ.25 వేల పరిహారం చెల్లించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో అజయ్, సాజిత్, గోవర్ధన్, దేవిదాస్, వేణుగోపాల్, సలీమ్ ఉన్నారు.

News August 19, 2025

ADB: దత్తు కుటుంబానికి ఆర్థికసాయం

image

మే నెలలో తరోడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.5 లక్షల చెక్కును మంగళవారం ఆదిలాబాద్‌లో అందజేశారు. ఈ విషాధ సంఘటన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సహాయనిధి కింద కుటుంబానికి ఆర్థికభరోసా కల్పించినట్లు తెలిపారు. MLAలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ తదితరులున్నారు.