News October 9, 2025
ADB: ప్రభుత్వ ఉపాధ్యాయుడి SUICIDE

ఇచ్చోడ మండలంలోని బోరిగామ జడ్పీఎస్ఎస్ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన విజయ్ కుమార్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 9, 2025
సంగారెడ్డి: ‘BAS బకాయిలు చెల్లించాలని వినతి’

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు మూడు సంవత్సరాల బకాయిలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ ప్రావీణ్యకు గురువారం వినతిపత్రం సమర్పించారు. మూడు సంవత్సరాల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చిందని పాఠశాల యజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బకాయిలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి, వనజా రెడ్డి, లింగాగౌడ్ పాల్గొన్నారు.
News October 9, 2025
వనపర్తి: స్టేతో ఒకవైపు ఖేదం.. మరోవైపు మోదం..!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తోపాటు నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించడంతో గ్రామాల నేతల్లో ఆనందం, ఆవేదన కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం పోటీకి నామినేషన్లకు సిద్ధమైన వారు ఆవేదన చెందుతుండగా, రిజర్వేషన్ కారణంగా పోటీకి అవకాశాలు కోల్పోయిన వారు స్టేతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలో స్టేతో 133 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఆగాయి.
News October 9, 2025
పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

పాలీహౌస్ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో ఉద్యానవన శాఖ సీడ్ ఏపీ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం రైతులతో సమావేశం అయి వారికి పలు సూచనలు ఇచ్చారు.