News March 24, 2025
ADB: ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం

కళాకారులకు మంచి అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని తామను తాము నిరూపించుకోవాలని ప్రముఖ నిర్మాత డాక్టర్ రవి కిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఫిల్మ్ సొసైటి ఆధ్వర్యంలో తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులను మీడియా ఎక్సలెన్సీ అవార్డు, షార్టు ఫిలిం తీసిన వారికి ప్రశంసాపత్రాలు అందించి శాలువాతో సత్కరించారు.
Similar News
News November 5, 2025
పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.
News November 5, 2025
UTNR: కొత్త ఐటీడీఏ పీవో ముందున్న సవాళ్లివే

ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవోగా యువరాజ్ మర్మాట్ నియమితులయ్యారు. పీవీటీజీల అభివృద్ధి, గిరిజన గ్రామాల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం, రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రవేశపెట్టిన మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 4, 2025
ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.


