News July 5, 2025

ADB: బయట పడుతున్న అధికారుల అవినీతి భాగోతాలు

image

ఉమ్మడి ADB జిల్లాలో ACB అధికారుల దాడుల్లో ప్రభుత్వ అధికారులు చిక్కుతున్నారు. అయినా కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్‌ను ACB అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. భీమారానికి చెందిన గంట నరేశ్(రైతు) భూమి పట్టాపాసుబుక్కు ఈకేవైసీ నిమిత్తం DTని సంప్రదించగా రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ACB అధికారులను ఆశ్రయించగా DTని పట్టుకున్నారు.

Similar News

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.

News July 5, 2025

గంభీరావుపేట: ‘చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2025

NRPT: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NRPT(M) కోటకొండ వాసి అంజిలప్ప(32)కు ధన్వాడ(M) రాంకిష్టయ్యపల్లి వాసి రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు HYDలో ఉంటూ కూలి పనిచేస్తూ ఉండేవారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న హత్యచేసింది. కుటుంబసభ్యుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.