News October 31, 2025
ADB: బల్ల కింద మాకిస్తేనే.. మీ పని చేస్తాం

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో మునిగి అవినీతికి పాల్పడుతున్నారు. సంక్షేమ పథకాల బిల్లులను మంజూరు చేయడానికి సామాన్యులను పీడిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో రెండు శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పశువుల షెడ్డుకు రూ.10వేలు, సస్పెన్షన్ ఎత్తివేతకు రూ.2 లక్షలు లంచం అడగడం అధికారుల దురాశకు నిదర్శనం. లంచం అడిగితే 1064, 9440446106 నంబర్లకు కాల్ చేయండి.
Similar News
News October 31, 2025
భారత్‌కు బిగ్ షాక్

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.
News October 31, 2025
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సిరిపురం జంక్షన్ వద్ద గల పటేల్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.
News October 31, 2025
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: గన్ని

తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉంగుటూరు మండలంలోని నాచుగుంట, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం గ్రామాలలో నేలకు ఒరిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ కడియాల రవి శంకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.


