News October 20, 2025

ADB: ‘బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

image

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. మీ పిల్లల పక్కనే మీరు ఉండి టపాసులు కాల్చండి. పేలని టపాసుల వద్దకు వెళ్ళకూడదు. అవి ఎప్పుడు పేలేది తెలియాదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది.

Similar News

News October 20, 2025

ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్‌లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

News October 20, 2025

NZB: కాలువలో దూకి తప్పించుకున్నాడు (UPDATE)

image

నిజామాబాద్‌లో <<18052007>>కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్‌ను<<>> ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హత్య చేసి పరారయ్యాడు. సీపీ సాయి చైతన్య నేతృత్వంలో 9 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులు జల్లెడ పట్టే సమయంలో సారంగాపూర్ ప్రాంతంలో అతని ఆచూకీ లభించింది. పోలీసులు వెంబడించడంతో నిజాంసాగర్ కెనాల్‌లో దూకి పరారయ్యాడు. ఆదివారం అదే ప్రాంతంలో పట్టుకున్నారు.

News October 20, 2025

21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

image

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.