News February 16, 2025
ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
మహబూబాబాద్: 20న జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రజిత తెలిపారు. ఈ నెల 20న మహబూబాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రైవేటు సంస్థల వారు పాల్గొంటున్నారని, ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, గ్రాడ్యుయేట్, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవారు పాల్గొనాలన్నారు.