News March 28, 2024
ADB: బీఎస్పీ నుంచి ఎంపీ బరిలో బన్సీలాల్ రాథోడ్..!

ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానానికి బీఎస్పీ నుంచి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బన్సీలాల్ రాథోడ్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి గొడం నగేశ్, బీఆర్‌ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News December 9, 2025
ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
News December 9, 2025
గర్భిణులకు ఎంసీపీ కార్డులేవు.. తాత్కాలికంగా జిరాక్స్ కార్డులు అందజేత

మాతా శిశు మరణాలను సున్న శాతానికి చేర్చడమే లక్ష్యమని వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు కానీ కనీసం గర్భిణులకు వివరాలను నమోదు చేసే కార్డులను సమకూర్చలేని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గర్భిణులు సొంత ఖర్చుతోనే పాత వాటిని జిరాక్స్ తీస్తున్నారు. నార్నూర్, గాదిగూడ పీహెచ్‌సీలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గర్భిణులకు ఎంసీపీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.
News December 9, 2025
ఆదిలాబాద్: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 166 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.


