News April 16, 2025

ADB: బెల్ట్ షాపుపై దాడులు.. కేసు నమోదు: CI

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2,200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 17, 2025

ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్‌గా జాదవ్ రాంజీ

image

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్‌గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

image

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

image

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.