News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News March 6, 2025
చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 6, 2025
నుజ్జునుజ్జయిన మారుతి సుజుకీ కారు.. సేఫ్టీ ఎక్కడ?

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.
News March 6, 2025
చిత్తూరు: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం SI రాజ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని ఇవాళ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని SP అభినందించారు.