News July 18, 2024
ADB: మద్యం మత్తులో మహిళ హంగామా

మద్యం మత్తులో ఒక మహిళ ఆర్టీసీ బస్సులో హంగామా సృష్టించింది. ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గురువారం నిర్మల్‌కు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ఇబ్బందులకు గురిచేసింది. మహిళను బస్సు దిగమని కండక్టర్ సూచించినప్పటికీ దిగనని మొండికేసింది. దీంతో బస్సును కలెక్టర్ చౌక్ వద్ద నిలిపివేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా బస్సులోంచి కిందికి దింపేసి మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News August 27, 2025
600 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలు: ADB SP

గణపతి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టర్లు వారీగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో నిరంతరం గస్తీతో పర్యవేక్షిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు.
News August 26, 2025
ADB: దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
News August 26, 2025
రాష్ట్ర బాలల కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన జిల్లా హెచ్‌ఆర్సీ ఛైర్మన్

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీత దయాకర్‌రెడ్డిని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాలల పరిరక్షణ, దత్తత, విద్య, ఎన్‌జీవోల పాత్ర వంటి వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.