News September 21, 2025
ADB: మసకబారుతున్న జ్ఞాపకాలు.. నేడు అల్జీమర్స్ డే

ఒరేయ్, ఏరా అని పిలిచే తాత, నానమ్మ మనల్ని గుర్తుపట్టకపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే వ్యాధే అల్జీమర్స్. వృద్ధాప్యంలో కనిపించే ఈవ్యాధితో మొదటగా చిన్న విషయాలు మర్చిపోవడం, మాటల్లో తడబడటం కనిపిస్తుంది. తర్వాత దశలో రోగి తన కుటుంబీకులను గుర్తుపట్టలేని స్థితికి చేరవచ్చు. ఆరోగ్య సమస్యలతో ఈ వ్యాధి వస్తుంది. వృద్ధులే మన అ’పూర్వ’ సంపద వారిని కాపాడుకుందాం. ADBలో 50000+ వృద్ధులున్నారు.
Similar News
News September 21, 2025
డియర్ లాలెట్టన్.. ఇది మీకు తగిన గుర్తింపు: చిరంజీవి

మలయాళ హీరో మోహన్‌లాల్‌కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విషెస్ తెలిపారు. ‘మై డియర్ లాలెట్టన్.. మీరు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’ అని Xలో పేర్కొంటూ మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
News September 21, 2025
NLG: ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ సస్పెండ్

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సెక్షన్ క్లర్క్ భార్గవ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు కలెక్టర్‌కు నివేదించారు. తన వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడని ఆయనపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి.
News September 21, 2025
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.