News August 9, 2024
ADB: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: కలెక్టర్

మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతిబాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మహిళ వికాస జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా ఆదాయం పెంపొందించే దిశగా శిల్పారామం లో, గాంధీ పార్కులో స్టాల్స్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలన్నారు.
Similar News
News December 31, 2025
బోథ్: పూణేలో ఆర్మీ జవాన్ మృతి

బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన జవాన్ కాసర్ల వెంకటేశ్(30) పూణేలో జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జవాన్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డారా లేక మరేదైనా జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కుమారుడు, తల్లి, సోదరుడు ఉన్నారు. జవాన్ మరణవార్తతో మర్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆయన స్నేహితులు పూణేకు బయలుదేరారు.
News December 31, 2025
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రహదారి భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన రహదారి భద్రతా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ, R&B శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (Black spots) గుర్తించాలన్నారు.
News December 31, 2025
ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.


