News March 5, 2025
ADB: మీనాక్షి MEETING.. శ్రేణులు WAITING

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ బుధవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆమె నివేదిక తెప్పించుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మీటింగ్‌లో పాల్గొననుండడంతో ఆమె ఏం చెబుతారోనని శ్రేణులు వెయిట్ చేస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News March 6, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ HNK: నకిలీ పురుగు మందుల ముఠా అరెస్ట్ ✓ HNK: శిరీష హత్య కేసులో కీలక మలుపు ✓ అర్ధరాత్రి నగరంలో ముమ్మర తనిఖీలు ✓ WGL జిల్లాలో విషాదం.. యువకుడి ఆత్మహత్య ✓ WGL: డ్రంక్ అండ్ డ్రైవ్.. జరిమానా ✓ పరకాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్
News March 6, 2025
సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News March 6, 2025
గుంటూరు: గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.