News March 28, 2024

ADB: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Similar News

News April 21, 2025

ADB: మృతదేహంపై కత్తిపోట్లు.. హత్యగా అనుమానం

image

భోరజ్‌ మండలం పెన్‌గంగా సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌కు సమాచారం అందించారు. మృతుడి ముఖంపై, ఛాతి భాగంలో కత్తిపోట్లు ఉన్నాయన్నారు. మహరాష్ట్ర వాసిగా అనుమానిస్తున్నామని.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం అందించాలన్నారు.

News April 20, 2025

ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్‌ అందజేస్తామన్నారు.

News April 20, 2025

ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!