News February 22, 2025

ADB: ముస్లిం ఉద్యోగులకు GOO NEWS

image

రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Similar News

News February 22, 2025

ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

image

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్‌ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 22, 2025

ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

image

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.

News February 22, 2025

ఆదిలాబాద్‌లో బాలికపై అత్యాచారం

image

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై శుక్రవారం అత్యాచారం చేయడంతో బాలిక తరఫు వారి ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిమ్స్ వద్ద స్థానికులు పెద్దఎత్తున గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రిమ్స్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!