News September 29, 2024

ADB: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక కాలనీలో 3 సంవత్సరాల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 9, 2025

ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్‌లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్‌లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.