News December 29, 2025
ADB: యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలి

రబీ సీజన్‌లో యూరియా పంపిణీ ప్రశాంతంగా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ASF జిల్లా అదనపు కలెక్టర్ వీసీ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియా పంపిణీ, నిల్వలు, కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు.
Similar News
News January 1, 2026
IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.
News January 1, 2026
పండుగలా పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
News December 31, 2025
HYDపై పాలమూరు ఘన విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T-20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్ నగర్ జట్టు 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.MBNR జట్టుకు చెందిన క్రీడాకారులు అబ్దుల్ రపే-53* (4s-5,6s-1), డేవిడ్ కృపాల్ రాయ్-103* (4s-11,6s-6) పరుగులు చేశారు.ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు అభినందించారు.


