News April 9, 2025
ADB: రాంజీగోండు ఆశయసాధనకు పనిచేద్దాం: MP

గిరిజన మొదటి తరం స్వాతంత్ర పోరాటయోధుడు రాంజీగోండ్ 168వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని ఎంపీ గోడం నగేశ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. రాంజీగోండ్ చిత్రపటానికి ఎంపీ నగేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. బ్రిటిష్, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చేసిన గొప్ప స్వతంత్ర యోధుడు రాంజీగోండ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 3, 2025
‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?
News November 3, 2025
వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం ఇంటర్వ్యూ

కడపలోని వైవీయూలో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈనెల 6న ఉదయం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు బయోఇన్ఫర్మేటిక్స్ / బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ / ఎంటెక్ బయోఇన్ఫర్మేటిక్స్‌లో 5 ఏళ్ల MSc, నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం yvu.edu.in ని సందర్శించాలన్నారు.
News November 3, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.


