News April 10, 2024

ADB: రాగల 5రోజులు వర్షాలు !

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

Similar News

News April 15, 2026

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

image

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.

News April 15, 2026

జిల్లాలో సెగలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాధారణం కంటే 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, వారం రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ను అత్యవసరంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తతే ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుందని పేర్కొన్నారు.

News April 15, 2026

ADB: ​’పల్లె వెలుగు’కు మాస్క్.. ఛార్జీల్లో ‘ఎక్స్‌ప్రెస్’

image

జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘పల్లె వెలుగు’ బస్సులకు ముందు భాగంలో ‘ఎక్స్‌ప్రెస్’ రంగులు వేసి, లోపల మాత్రం సాధారణ సౌకర్యాలతోనే నడుపుతున్నారు. కానీ, టికెట్ ఛార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్ ధరలకే వసూలు చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల్లో బస్సులు చాలా ఉన్నాయని, దీనివల్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.