News March 20, 2025

ADB: రిమ్స్‌లో అన్ని డెలివరీలు చేయాలి: కలెక్టర్

image

రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం అన్ని శాఖల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని.. వారిని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలన్ నారు. ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.

News February 11, 2026

బోథ్ అడవుల్లో పులుల సంచారం

image

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News February 10, 2026

ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

image

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.