News March 12, 2025

ADB రిమ్స్‌లో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, సీనియర్ రెసిడెంట్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, సీఎంఓ పోస్టులు ఉన్నాయన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూలు ఉంటాయని, వివరాలకు rimsadilabad.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 29, 2026

ఆదిలాబాద్‌లో పత్తికి ‘వర్ష’ గ్రహణం

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగుపై ప్రకృతి పగబట్టింది. వానాకాలం సీజన్‌లో 5.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా, అందులో సింహభాగం (4.40 లక్షల ఎకరాలు) పత్తిదే. సాధారణంగా 35-44 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, భారీ వర్షాలకు కాయలు కుళ్లిపోయి దిగుబడి పడిపోయింది. మార్కెట్‌కు కేవలం 15.96 లక్షల క్వింటాళ్లే చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 28, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ADB SP

image

జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. ఈ వారం 14 ఫిర్యాదులు అందాయని, మోసపోయిన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. అనుమానాస్పద లింకులు, లోన్ యాప్‌లు, ఆఫర్లను నమ్మవద్దని.. ఆన్‌లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందే అవకాశం ఉందన్నారు.

News March 28, 2026

ఆదిలాబాద్: MATHS పరీక్షకు 18 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం మ్యాథమెటిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 52 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10894 మంది విద్యార్థులకు గాను 10876 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.