News January 16, 2026

ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

image

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

Similar News

News January 29, 2026

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉట్నూర్ యువకుడికి చోటు

image

ఉట్నూర్‌కు చెందిన యువకుడు అల్లకొండ అరుణ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్లాక్ బెల్ట్ 3rd డన్‌లో 30 నిమిషాల్లో 1255 కిక్స్ కొట్టి ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమంలో 973 మంది విద్యార్థులు కలిపి 8 లక్షల కిక్స్ కొట్టారు.

News January 27, 2026

ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా పాటించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ దృష్ట్యా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపులో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News January 27, 2026

రెచ్చగొట్టే ప్రచారంపై కఠిన చర్యలు: డీఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో గెలుపోటములపై రెచ్చగొట్టే పోస్టులు, వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్య నేరమని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, తప్పుడు సర్వేలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.