News April 13, 2026
ADB: రిమ్స్‌లో రీల్స్.. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ

ADB రిమ్స్‌లో <<19636529>>మెడికోలు <<>>చేసిన రీల్స్ వ్యవహారంపై అధికారులు సీరియస్ అయ్యారు. Way2Newsలో వచ్చిన కథనంపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విద్యా విల్సన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 13, 2026
సమ్మర్‌లో సర్వర్ల దాహం.. సామాన్యుడి భారమా?

HYD గ్లోబల్ డేటా సెంటర్లకు అడ్డాగా మారింది. దీనివెనక భయంకరమైన వాస్తవం దాగి ఉంది. AC గదుల్లో ఉండే సర్వర్ల కోసం HMWSSB కేటాయిస్తున్న నీటితో వేలాది మంది సామాన్యుల గొంతు తడపొచ్చు. కాగా, పరిశ్రమలకు ఇచ్చే సింగిల్ విండో క్లియరెన్స్‌లో అరౌండ్ ది క్లాక్ నీటి సరఫరా నిబంధన ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తాగునీరు అనేది పౌరుడికి మొదటి ప్రాధాన్యత. పరిశ్రమలకే ప్రాధాన్యత ఇస్తే చట్టపరమైన ఉల్లంఘన అవుతోంది.
News April 13, 2026
కామారెడ్డి: అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి

అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అన్నారు. సోమవారం జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి సుధాకర్ అగ్నిమాపక కార్యలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో మాట్లాడారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సేఫ్ స్కూలు, సేఫ్ హాస్పిటల్, సేఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ తదితర అంశాలపై వివరించారు.
News April 13, 2026
తిరుచానూరులో TDP నేతల వసూళ్లు: YCP

తిరుచానూరులో అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నేతలు వసూళ్ల దందా చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన భక్తులపై పాశవికంగా దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ గూండాలు మరింతగా రెచ్చిపోతున్నారు. భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నా టీటీడీ చోద్యం చూస్తోంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.


