News November 9, 2025

ADB: రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

డ్రైవర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.37 లక్షలు కాజేసిన ఘటన ADBలో జరిగింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాలు.. క్రేన్ డ్రైవర్ గోల్వే సతీష్‌కు గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడుతూ.. తమ దగ్గ లీటర్ల డిజిల్ ఉందని సగం ధరకే ఇస్తామని నమ్మించగా బాధితుడు నగదును ఫోన్పే ద్వారా చెల్లించాడు. సైబర్ నేరగాడు ఒక పెట్రోల్ పంపు చిరునామా చెప్పి డిజిల్ ఇస్తారని తెలుపగా.. బాధితుడు ఆ డీజిల్ పంపుకు వెళ్ళగా మోస పోయినట్లు గ్రహించాడు.

Similar News

News November 9, 2025

సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

image

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్‌. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.

News November 9, 2025

HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

image

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.