News March 7, 2025

ADB: రూ.20లక్షల అప్పు.. అందుకే సూసైడ్!

image

నేరడిగొండలో<<15670214>> దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్‌కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్‌లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News March 9, 2025

కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన వ్యక్తి హతం

image

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కిడ్నాప్‌కు సహకరించిన ముఫ్తీ షా మిర్‌ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్‌లో కాల్చి చంపారు. 2016లో కుల్‌భూషణ్‌‌ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్‌లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్‌ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.

News March 9, 2025

NLG: స్లోగా పన్ను వసూళ్ల ప్రక్రియ!

image

నల్గొండ జిల్లాలోని బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం సమీపిస్తున్నా.. ఏడు మున్సిపాలిటీల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు.

News March 9, 2025

NLG: రేపటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

image

ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!