News February 15, 2026
ADB: రేపటి ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల దృష్ట్యా సోమవారం కలెక్టర్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రజావాణి లేనందున కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని జిల్లా ప్రజలకు సూచించారు.
Similar News
News February 16, 2026
BREAKING: కాంగ్రెస్‌లోకి ADB మున్సిపల్ ఛైర్‌పర్సన్

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
News February 16, 2026
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.
News February 16, 2026
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.


