News October 13, 2025

ADB: రేషన్ కమీషన్.. డీలర్ల పరేషాన్

image

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీలర్లకు క్వింటాకు రూ.140 చెల్లిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 1468 రేషన్ షాపులున్నాయి. వీటిని నడుపుతున్న డీలర్లు కమీషన్ చెల్లించాలని కోరుతున్నారు.

Similar News

News October 13, 2025

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి.. ఆదాయం జోరు

image

పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి, డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్క్‌లోని దుప్పులను వీక్షించారు. 496 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్ లైఫ్ శాఖకు ₹27,390 ఆదాయం లభించింది. 480 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్‌కు కూడా భారీగా ఆదాయం వచ్చింది.

News October 13, 2025

వ్యాయామంతో క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్ట్స్‌కి చెక్

image

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌‌లో భాగమైన రేడియోథెరపీతో పేషెంట్లు విపరీతమైన అలసటకు గురవుతారు. అయితే రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి త్వరగా కోలుకోవచ్చని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వ్యాయామం కారణంగా చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది. కాబట్టి చికిత్స తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#Womenhealth<<>>

News October 13, 2025

200% టారిఫ్స్ వేస్తానని బెదిరించా: ట్రంప్

image

ఇండియా-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘టారిఫ్స్‌ ఆధారంగానే నేను కొన్ని యుద్ధాలను ఆపాను. ఇండియా-పాక్ వార్ విషయంలోనూ అదే చేశాను. 100%, 150%, 200% విధిస్తానని హెచ్చరించా’ అని తెలిపారు. 24 గంటల్లోనే ముగించానని చెప్పారు. సుంకాలతో భయపెట్టకపోతే ఘర్షణలు ఆగేవి కాదన్నారు. పీస్ సమ్మిట్ కోసం ఈజిప్టుకు బయల్దేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు.