News November 18, 2024
ADB: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన అనిత (42) స్థానిక తాంసి రైల్వే గేట్ వద్ద వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ లారీ ఆమె కాళ్ల పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక కాలు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాల పాలయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆమెను రిమ్స్‌కు తరలించారు.
Similar News
News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
News December 26, 2024
నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’
కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్లు , టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
News December 26, 2024
నిర్మల్: చెత్త కవర్లో శిశువు మృతదేహం లభ్యం
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.