News December 4, 2025

ADB: రోడ్లే దిక్కులేవంటే.. ఎయిర్ పోర్టు ఎందుకు.?

image

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్లు లేక ఆదివాసీ బిడ్డలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నవంబర్ నెలలో రోడ్లు లేక ముగ్గురు గర్భిణులు ప్రాణాలు విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఎయిర్ పోర్టు తెచ్చి ఆదివాసీలను ఫ్లైట్స్‌లో తరలిస్తారా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

Similar News

News December 5, 2025

కడప: మేయర్ స్థానానికి ఎన్నిక.. ఆశావహులు వీరే.!

image

కడప మేయర్ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ స్థానానికి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు సురేశ్ బాబు మేయరుగా కొనసాగారు. ఆయనపై అనర్హత వేటు వేయడంతో నూతన ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉంటే వైసీపీకి 39 మంది సపోర్టు ఉంది. దీంతో పాకా సురేశ్, బసవరాజు, గంగాదేవి, మల్లికార్జున, శ్రీలేఖతో పాటు మరి కొంతమంది కార్పొరేటర్లు మేయర్ బరిలో ఉన్నారు.

News December 5, 2025

విశాఖలో పర్యాటకులకు గుడ్ న్యూస్

image

విశాఖలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు VMRDA ప్రణాళిక రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కార్డుతో నగరంలో 9 ప్రదేశాలను సందర్శించోచ్చు. ఒక రోజు టికెట్ (రూ.250- 300), నెల రోజులకు సిల్వర్ కార్డ్.. ఏడాది వరకు సబ్‌స్క్రిప్షన్‌‌ తీసుకోవచ్చు. ప్యాకేజీలో కైలాసగిరి, తొట్లకొండ, TU-142, INS కురుసురా, సీ-హారియర్, UH-3H హెలికాప్టర్, తెలుగు మ్యూజియం, సెంట్రల్ పార్క్, VMRDA పార్క్ ఉన్నాయి. అమలులోకి 3 నెలలు సమయం పట్టనుంది.

News December 5, 2025

కొవ్వూరు ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

image

రానున్న పుష్కరాల నాటికి కొవ్వూరును సంపూర్ణంగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పుష్కర కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబుని కోరారు. గురువారం ఆయన సీఎంను కలిసి మొత్తం రూ.286.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందజేశారు. పంచాయతీరాజ్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో రోడ్లు, ఆలయ పునర్నిర్మాణం, స్నాన ఘాట్లు, నివాస సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.