News December 7, 2025

ADB: లక్ష ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. మనమే గెలవాలె

image

పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు డబ్బు, మద్యం, సరుకులతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. నామినేషన్ల నుంచి ఖర్చు లెక్కలు పెరుగుతున్నాయి. ఓటర్లు కూడా తమ ఓటుకు ఎక్కువ ధర పలుకుతుండటంతో బేరసారాలకు దిగుతున్నారు. సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారింది. పగలంతా ప్రచారం చేసి రాత్రి అవ్వగానే ఓటర్లకు విందులు, వినోదాలు ఏర్పాటుచేస్తున్నారు. అందరినీ తమతోనే ఉంచుకుంటూ ప్రత్యర్థితో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.

Similar News

News December 9, 2025

గద్వాల: రూ.50 వేలకు మించితే పత్రాలు తప్పనిసరి: ఎస్పీ

image

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.50 వేలకు మించి నగదు తరలించేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 11న ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (BNSS) యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

image

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.