News July 2, 2024

ADB: వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.

Similar News

News July 5, 2024

జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS

image

జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

ఆదిలాబాద్: వారికి రేషన్ బియ్యం రాదు

image

బోగస్ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ డీలర్లకు లబ్ధిదారుల జాబితా పంపించి పరిశీలన ప్రక్రియ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేయించి బోగస్ కార్డులు రద్దు, అనర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దు చేయగా, 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.

News July 5, 2024

రాష్ట్ర గవర్నర్ OSDగా మంచిర్యాల జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.