News September 16, 2025

ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.

Similar News

News February 12, 2026

ఆదిలాబాద్: రేపు ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా సహకరించాలని, కౌంటింగ్ సందర్భంగా ‘ఐ లవ్ ఆదిలాబాద్ నుంచి మావల పోలీస్ స్టేషన్ వరకు’ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రేపు ఉదయం నుంచి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News February 12, 2026

ADB: ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చూసుకోవాలి: SP

image

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న సమయంలో దొంగతనాలు జరగకుండా ఉంటాయన్నారు. ఒక వేళ జరిగినప్పుడు వాటిని చేధించడంలో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తుందన్నారు.

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.