News October 30, 2025
ADB: ‘వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి’

మోంథా తుఫాను ప్రభావంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని TGVP రాష్ట్ర కార్యదర్శి కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సెలవులు ప్రకటించే దిశగా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ విజ్ఞప్తిలో ఆయన వెంట సతీశ్, సురేశ్ ఉన్నారు.
Similar News
News October 30, 2025
పెద్దన్నవారిపల్లికి సీఎం చంద్రబాబు రాక

సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 1న తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సతీశ్ కుమార్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.
News October 30, 2025
సిద్దిపేట: హరీశ్ రావును పరామర్శించిన కవిత

ఎమ్మెల్యే హరీశ్ రావును జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత దంపతులు గురువారం పరామర్శించారు. హరిశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య రాజకీయం పరంగా ఎన్నో విభేదాలు నడుస్తున్న క్రమంలో కవిత హరీశ్ రావును పరామర్శించడం ఆసక్తికరంగా మారింది.


