News December 6, 2025
ADB: వలస ఓటర్ల కోసం ‘ఖర్చుల’ ఆఫర్

ఉమ్మడి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనెల 11న పోలింగ్ ఉన్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామం బయట జీవనోపాధి కోసం ఉంటున్న వలస ఓటర్లపై దృష్టి సారించారు. అభ్యర్థులు వారికి ‘హలో అన్న.. హలో తమ్ముడూ..’ అంటూ ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. ఓటు వేయడానికి గ్రామాలకు వచ్చేందుకు అవసరమైన రవాణా, ఇతర ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చి, తప్పక వచ్చి ఓటు వేయాలని వేడుకుంటున్నారు.
Similar News
News December 6, 2025
తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 6, 2025
నాగర్‌కర్నూల్: ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’.. పోస్ట్ వైరల్

ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని ఇంటి యజమాని ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంబేడ్కర్ మనకు కత్తిని కాకుండా ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని, డబ్బుకు, మందుకు ఓటును అమ్ముకోవద్దని, మూర్ఖులవుతారో, రాజులవుతారో నిర్ణయం ప్రజల చేతిలోనే ఉందని ఆ ఫ్లెక్సీలో ప్రదర్శించారు.
News December 6, 2025
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్స్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)-చెన్నై ఎగ్మోర్(MS) (నం.07146,47) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 6.40 గంటలకు SCలో బయలుదేరే ఈ ట్రైన్ 7న అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 8 గంటలకు MS చేరుకుంటుందన్నారు, 7న మధ్యాహ్నం 12.30కి MSలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ, 8న తెల్లవారుజామున 3కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.


