News December 3, 2025

ADB: వార్డు అభ్యర్థులే దిక్కులేరాయే..!

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు విభజించు, పాలించు సూత్రాన్ని అవలంబిస్తున్నారు. భీంపూర్ మండలంలోని ఓ గ్రామంలో కొందరికి వార్డు మెంబర్ల అభ్యర్థులు లేకపోవడంతో తమకు సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల్లో ఐదారుగురితో వార్డుల్లో నామినేషన్లు వేయించారు. కుటుంబాలను విడగొడుతూ తమకు మద్దతుదారులు ఉన్నారని వర్గాలు ఏర్పరుస్తున్నారు.

Similar News

News December 4, 2025

హుస్నాబాద్: గ్రామాల్లో వెలుగులు నింపేవే సర్పంచ్ ఎన్నికలు: CM

image

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసేవాళ్లను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికలు అనేవి గ్రామాలలో అభివృద్ధి, వెలుగులు నింపే ఎన్నికలని పేర్కొన్నారు.

News December 4, 2025

కెప్టెన్ దీపికకు సీఎం సత్కారం

image

భారత అంధుల టీ20 కెప్టెన్ దీపికను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్‌లో ట్రోఫీ గెలవడం అభినందనీయమని కొనియాడారు. విజయవాడలో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో దీపికను సత్కరించి రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాగా దీపికది సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామం.

News December 4, 2025

మార్గశిర గురువారం.. ఎందుకంత ప్రత్యేకం?

image

హిందూ సంప్రదాయంలో శ్రావణం, మాఘం, కార్తీకం, మార్గశిరం వంటి కొన్ని పవిత్ర మాసాలున్నాయి. ఈ మాసాల్లో కొన్ని వారాలు దైవారాధనకు అత్యంత విశిష్టమైనవిగా చెబుతారు. అలాగే మార్గశిర గురువారాన్ని శుభదినంగా భావిస్తారు. ఈరోజున కనక మహాలక్ష్మిని పూజిస్తే.. సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. ఈ ఏడాది ఈ మార్గశిర గురువారం పౌర్ణమి కలయికతో వచ్చింది. అందుకే ఈ రోజును అతి పవిత్రమైన, శ్రేష్ఠమైన రోజుగా పండితులు చెబుతున్నారు.