News May 3, 2024

ADB: విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు

image

ఉమ్మడి ఆదిలాబాద్ BRS స్థానిక సంస్థల MLC దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. MLCగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ తీర్పు చెప్పింది. దండె విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2022లో ఎన్నికయ్యారు.

Similar News

News January 15, 2025

NRML: శిశువు మృతదేహం లభ్యంపై దర్యాప్తు

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. SI శ్రీకాంత్ కథనం ప్రకారం.. అప్పుడే పుట్టిన మగ శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శిశువుకు 5 నుంచి 6 నెలల వయసు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News January 15, 2025

కౌటాల: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

image

కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్పీ దేవి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని, 3 కోడిపుంజులు, నగదు రూ.3900, 3 కోడి కత్తులు స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 15, 2025

నిర్మల్‌: జనవరి 22 వరకు అర్హులను ఎంపిక చేయాలి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈనెల 22 వరకు పంచాయతీలలో గ్రామ సభలను, పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేయాలని అధికారులకు వీసీలో ఆదేశించారు.