News April 9, 2025
ADB: విద్యార్థులకు GOOD NEWS.. అడ్మిషన్లు START

ADB జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. బీఏ(హెచ్ఈపీ), బీకాం (సీఏ), బీఎస్సీ, బీజడ్సీ, డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 9849390498 లేదా https://ttwrdcs.ac.in/Boat వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News April 17, 2025
ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.
News April 17, 2025
ADB: యువతికు వేధింపులు.. రహీం ARREST

మహిళల, విద్యార్థుల రక్షణకు షీటీం నిత్యం అందుబాటులో ఉంటుందని షీటీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సునీత తెలిపారు. ADBకు చెందిన యువతిని HYDలో చార్మినార్ వద్ద దుస్తుల దుకాణంలో దిగిన ఫొటోను అక్కడ పనిచేస్తున్న షేక్ రహీం మార్పింగ్ చేశాడు. దానిని ఆధారం చేసుకొని సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా ADBకు రప్పించి అరెస్టు చేసినట్లు ASI తెలిపారు.
News April 17, 2025
నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు ARREST

నేడిగొండ మండలంలో గంజాయి పట్టుబడ్డ కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ భీమేశ్ తెలిపారు. నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్(20) గంజాయితో ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి సోదాలు నిర్వహించగా పట్టుబడ్డారన్నారు. బత్తుల కిరణ్ విచారించగా ధాంస తండాకు చెందిన పెందూర్ లచ్చు వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.11,250 విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.