News December 26, 2025

ADB: వివాహితకు యువకుడి వేధింపులు.. SUICIDE

image

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్‌లో చోటుచేసుకుంది. SI శ్రీ సాయి తెలిపిన వివరాలు.. మండలంలోని సాకెర గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30)ని అదే గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ రెండేళ్లుగా భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 26, 2025

WGL: మహిళా సంఘాల ఖాతాల్లో రూ.6.50 కోట్లు జమ

image

వరంగల్ జిల్లాలో రుణాలు సకాలంలో చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాలకు రూ.6.50 కోట్లు విడుదల చేసి 7,540 సంఘాల ఖాతాల్లో జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ వడ్డీ రాయితీ వర్తించింది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 26, 2025

చీరాల: మద్యం మత్తులో ASI రచ్చ.. SP ఆగ్రహం

image

చీరాలలో మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన వేటపాలెం ASI రవికుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకుని వీఆర్‌కు పంపించినట్లు SP ఉమామహేశ్వర్ తెలిపారు. మద్యం మత్తులో పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరని ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 26, 2025

పార్వతీపురం:104 మొబైల్ మెడికల్ యూనిట్లలో ఉద్యోగాలు

image

రాష్ట్రవ్యాప్తంగా 104 MMUలలో ఖాళీగా ఉన్న డ్రైవర్, DEO పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పార్వతీపురం జిల్లా 104 మేనేజర్ S.కృష్ణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రవపత్రాలతో డిసెంబరు 27,28 తేదీలలో విజయవాడ మార్కెట్ యార్డ్, గొల్లపూడి DLO office వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు.