News March 25, 2025

ADB: వివేక్‌కి శుభాకాంక్షలు తెలిపిన పాయల్ శంకర్

image

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. వివేక్‌కు మంత్రి పదవి వచ్చేసిందంటూ పాయల్ శంకర్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వివేక్ కుటుంబం హడావుడి కొనసాగుతోందంటూ BRS MLA మల్లారెడ్డి ఆటపట్టించగా.. మల్లారెడ్డి జోష్ కొనసాగుతోందని వివేక్ అన్నారు.

Similar News

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

News October 27, 2025

జూరాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

image

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.275 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు కాగా, పవర్ హౌస్‌లకు 23,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ ఫ్లో 23,105 క్యూసెక్కులుగా ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు అన్ని గేట్లను నిలుపుదల చేశారు.

News October 27, 2025

గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

image

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.