News March 26, 2025
ADB: వ్యక్తి హత్య.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్‌కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్‌ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.
Similar News
News March 29, 2025
ఆదిలాబాద్: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News March 28, 2025
ADB: ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ల పాత్ర కీలకమైంది: ఎస్పీ

ప్రతి పోలీస్ స్టేషన్ నందు రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షనిస్టూలతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు.
News March 28, 2025
ADB: తెలుగు నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో శుక్రవారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్, పడకంటి సూర్యకాంత్, బండారి వామన్, కందుల రవీందర్ తదితరులు ఉన్నారు