News March 27, 2025

ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 4, 2025

చేవెళ్ల బస్సు ప్రమాదంపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు దిగ్బ్రాంతి

image

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణక్క ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనా స్థలంలోని దృశ్యాలు ఎంతో బాధ కలిగించాయని, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

News November 4, 2025

ఆదిలాబాద్: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్’

image

పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యం రిజిస్ట్రేషన్‌పై ఒక రోజు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, పరిశ్రమల శాఖ జీఎం.పద్మభూషణ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

News November 4, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.