News December 25, 2024
ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుందెబ్బ మద్దతు

టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్‌లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
ఎస్పీ గ్రీవెన్స్‌కు 32 ఫిర్యాదు: ADB ఎస్పీ

పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.
News December 22, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


