News February 21, 2025

ADB: సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.

Similar News

News February 21, 2025

ADBకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

image

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.  పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆమెకు పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.

News February 21, 2025

ఇంద్రవెల్లి: నాలుగు వైన్స్‌ల్లో చోరీ

image

ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.

News February 21, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!