News October 12, 2025
ADB: సామాన్యుడి ఆయుధం.. RTI ACT

పాలనలో పారద్శకత, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడానికి పౌరులకు అధికారం ఇస్తుంది సమాచార హక్కు చట్టం. సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే అధికారులు ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తి స.హ చట్టం ద్వారా ఉపాధి పనుల్లో, అధికారుల సంతకాల పోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి తెచ్చాడు. చట్టం గురించి ప్రజలకు తెలియజేయడానికి OCT5-12వరకు సహ చట్టం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 12, 2025
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

తల్లాడ మండలంలోని పినపాక గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఫొటోగ్రాఫర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వైరా వైపు బైక్‌పై వెళ్తున్న కొణిజర్లకు చెందిన ఫొటోగ్రాఫర్ పవన్ (22)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 12, 2025
HYD: గిజిగాడి గూడు.. కనువిందు చేసే చూడు

కాంక్రీట్ మయమైన సమాజంలో పక్షుల కిలకిలరావాలకు సగటు మనిషి దూరమవుతున్నాడు. నాడు పొద్దు పొద్దునే కోడి కూతతో మొదలయ్యే జీవన ప్రమాణశైలి క్రమంగా ఆలారమ్ కూతకు పరిమితం అయింది. పట్టణీకరణలో భాగంగా చెట్లు, గుట్టలను ధ్వంసం చేయడంతో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని తారామతిపేటలో గిజిగాడి గూడు కనువిందు చేస్తోంది. అవి చేసే ధ్వనులను, వాటి గూడు అల్లికలు బాటసారులు ఆస్వాదిస్తున్నారు.
News October 12, 2025
‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు సర్కార్

TG: ‘స్థానిక’ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెచ్చిన జీవో నం.9పై హైకోర్టు <<17958620>>స్టే<<>> విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. అటు PCC చీఫ్ మహేశ్ ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.